సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఆదేశాల ప్రకారం జైళ్లలో ఉన్న బాలనేరస్థులను గుర్తించడం మరియు న్యాయస్థానాల ముందు వారి బాల్యత్వాన్ని నిరూపించడానికి అవసరమైన చట్టపరమైన సహాయం అందించడం లక్ష్యంగా "యువతను పునరుద్ధరించడం" పేరుతో పాన్-ఇండియా క్యాంపెన్ లో భాగంగ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శనివారం స్పెషల్ సబ్ జైలు భద్రాచలంను సందర్శించి జైలు లో ఉన్న ఖైదీలకు న్యాయ అవగాహన కల్పించి క్యాంపెయిన్ ఉద్దేశంను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, జైలు సూపరింటెండెంట్ ఉపేందర్,లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బాసం శారద,జైలు విసిటింగ్ లాయర్స్ పేరాల వెంకటేశ్వర్లు, పి ఆర్ తిరుమలరావు, పేరాల నాగరాజు, మ్ వి రమణ, టి లలిత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin