సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో విద్యా బోధనలో విలువల అనుసంధానముపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం నిజంగా తన పూర్వపు పుణ్యమేనన్నారు. ఇక్కడ సమావేశమైన వారందరూ దైవిక నివాసంలో ఉండేటట్లు సమానంగా ఆశీర్వదించబడ్డారన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి విద్యాలయాల్లో ప్రవేశించేందుకు విద్యార్థులకు గట్టి పోటీ ఉంటుందని, తమ బిడ్డను స్వామివారి బడిలో చేర్పించాలని ప్రతి తల్లిదండ్రుల కల ఉంటుందన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలతో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల స్వామివారి విద్యాసంస్థగా రూపాంతరం చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రశాంతి నిలయం ప్రపంచంలోనే అత్యంత లౌకిక ప్రదేశమన్నారు. శ్రీ సత్యసాయి మానవ విలువల కార్యక్రమం ద్వారా ప్రణాళిక చేయబడిన పాఠ్యాంశాల్లో ఈ అందమైన దేశంలో ఉన్న గొప్ప భరతభూమి, సంస్కృతి సంప్రదాయాలు మరియు విశ్వాసాల ఐక్యత గురించి చాలా వివరాలు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు ధార్మిక, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తుకు ఇది మొదటి మెట్టు అని అన్నారు. డిగ్రీలు పొందడం ద్వారా ఎవరైనా అక్షరాస్యులు కాగలరని, అయితే విద్యావ్యవస్థకు విలువలను తీసుకువచ్చినప్పుడే విద్యావంతులుగా పిలవబడతారన్నారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ప్రతి ఒక్కరు చేరుకోవాలని తెలిపారు. శ్రీ సత్య సాయి బాబా లోగో అన్ని మతాలకి అన్ని కులాల వారికి గొప్ప నిదర్శమని పేర్కొన్నారు పిల్లలకు అక్షర జ్ఞానంతో పాటు గొప్ప విలువలను ఉపాధ్యాయుల అందించాలని తెలిపారు. గురువులు చీకటన పారద్రోలి విద్యార్థులకు జ్ఞాన దీపం వెలిగించి సమాజంలో పిల్లలకు బంగారు భవిష్యత్తు అందజేయాలని తెలిపారు. చిన్న కార్యక్రమం విద్యా బోధనలో విలువల అనుసంధానంలో కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రుల భాగస్వాములై కలిగా ఉండాలని తెలిపారు సత్య సాయి ట్రస్ట్ కృషి వలన, జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం అమలు చేయుచున్నామని తెలిపారు వారంలో చివరి శనివారం రోజుకు ఒక గంట ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా బోధన లో విలువల అనుసంధానం అమలపై విద్యార్థులను కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే.రత్నాకర్ మాట్లాడుతూ పిల్లలలో పరివర్తన తీసుకురావడానికి స్వామి ఆరు దశాబ్దాల క్రితమే బాలవికాస్‌ను ప్రారంభించారన్నారు. పిల్లల భవిష్యత్తుకు విలువలు ఎంత ముఖ్యమో శ్రీ సత్యసాయి స్వామికి తెలుసునని, ఈరోజు ప్రభుత్వానికి ప్రచారం జరగడం శుభపరిణామమన్నారు. బాలవికాస్ కార్యక్రమం భారతదేశంలో నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు . ప్రతి మతం అంతిమంగా మంచిని బోధిస్తుందని, ప్రేమ మార్గాన్ని చేరుకోమని కోరుతుందన్నారు. శ్రీ సత్యసాయి బాబా ఏ ప్రత్యేక మతానికి చెందినవారు కాదని, వివిధ విశ్వాసాల నుండి వచ్చిన గురువులు సార్వత్రికమైన సాయి తత్వాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంటారన్నారు. శ్రీ సత్యసాయి యొక్క అసమానమైన బోధనలను అర్థం చేసుకోవాలన్నారు. ఈ జిల్లాకు చెందిన ప్రతి ఒక్కరూ తాము శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ వృత్తిని భగవంతుడి అరుదైన బహుమతిగా భావించాలన్నారు. దేశాన్ని ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయుడేనని, ఒకసారి విద్యావ్యవస్థలో విలువలు ఇమిడిపోతే వెనక్కి తగ్గే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ సహకారం అందించడంతోపాటు ఉపాధ్యాయ వర్గాన్ని సాయి రూఫ్ కిందకు తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా బోధనల విలువల అనుసంధానం పై వివిధ కరదీపికలు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు లక్ష్మణ్ రావు, సత్యనారాయణమూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపల్ శశి పాల్, శకుంతల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin