సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలోని జెండా వేపమను వార్డు సచివాలయం-2 , కర్నాటక నాగేపల్లి వార్డు సచివాలమం-5, పెద్దబజారు వార్డుసచివాలయం-3 ఆకస్మికంగా తనిఖీ చేసినా జిల్లా కలెక్టర్ ... సచివాలయాలకు వస్తున్న సర్వీసులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. పుట్టపర్తిలోని జెండా వేపమను వార్డు సచివాలయం-2 , కర్నాటక నాగేపల్లి వార్డు సచివాలమం-5, పెద్దబజారు వార్డు సచివాలయం- 3 జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా సచివాలయాలలో సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని సిబ్బంది ఆదేశించారు తదుపరి సచివాలయ కార్యాలయంలో గల అన్ని రికార్డులను పరిశీలించారు. వివిధ సంక్షేమ పథకాలు గోడపత్రికలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలన్నీ కూడా వెనువెంటనే అప్లోడ్ చేయాలని ఆయా వార్డ్ సచివాలయాల సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, కఠిన చర్యలు కూడా తప్పవని సూచించారు. ప్రజలలో మమేకమై సమస్యలను విని పరిష్కరించినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు ఈశ్రమ్ పోర్టల్ లో ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ 100 శాతం నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేసేలా చూడాలన్నారు. సచివాలయాలకు వస్తున్న సర్వీసులను గడువులోపు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు వైద్య సేవలు ప్రజలకు అందజేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్ చెరువు భాస్కర్ రెడ్డి సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin