Saturday, 18 April 2026 08:18:13 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

Date : 01 January 2026 07:13 PM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్య ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులతో కలసి కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులు, పాఠశాల విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చలు, మొక్కలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, లక్ష్యాలను పూర్తి చేయాలని, అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో వుండాలని, ముఖ్యం తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, దార కవిత ఏ.ఎస్పీ శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్ తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఎస్ లు, ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :