సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణంలో గత వారం రోజులుగా కిన్నెరసాని మంచినీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు..ఈ మేరకు శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి పురపాలక కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు..అనంతరం సంబంధిత అధికారులకు ఖాళీ బిందెలను అందజేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి దారుణంగా ఉందని,ప్రజలు దాహర్తితో అల్లాడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు,అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..కౌన్సిలర్లుగా కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు సంత టెండర్లు ఇతర కాంట్రాక్టు పనులు,కమీషన్ల కోసం తాపత్రయ పడుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించడం లేదని లేదని మండిపడ్డారు...తనకు తానే అపరభగీరధుడు,కిన్నెరసాని జలప్రధాత అని బిరుదులు తగిలించుకున్న స్థానిక ఎమ్మెల్యే వనమా ఎక్కడ ఉన్నారని నిలదీశారు..ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళానని,త్వరలో 130 కోట్లు మంజూరు అవుతాయని ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికి రూపాయి కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు.సమస్య ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉంటే రాబోయే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి పట్టణ ప్రజలకు ప్రతి రోజు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో లక్ష్మీ,శారద,సుశీల,బోనవేళ్ళ సతీష్,శీలం అఖిల్,బాణోత్ అనీల్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin