Monday, 14 September 2026 03:05:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజన (లంబాడా) ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి...

Date : 06 November 2023 12:56 AM Views : 361

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని మేళ్ల చెర్వు రోడ్ లో గల శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గ గిరిజన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి ,రాష్ట్ర గిరిజన ముఖ్య నాయకులు రమణ నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు.తదనంతరం గిరిజన ఆత్మీయ సమావేశం ను ఉద్దేశించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ గూడేలను,తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చాలని గిరిజనులు ఎన్నో ఏండ్లు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకో లేదని,ఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 4 వేల తండాలను,నియోజక వర్గ పరిధిలో 49 గూడెలను,తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా చేసినామని తెలిపారు.నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేశాము. దీంతో గిరిజనులు స్వయంపాలన సాగిస్తున్నారని చెప్పారు. గిరిజనులకు పొడు భూములు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల భూమికి పోడు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు త్రీఫేజ్‌ కరెంటు ఇస్తున్నామని తెలిపారు.గిరిజనులకు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. హైదరాబాద్ నడి బొడ్డున బంజారా హిల్స్ లో బంజారా భవన్, ఈ పట్టణంలో గిరిజన భవన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది .మఠం పల్లి రైల్వే స్టేషన్ కి సంత్ సేవా లాల్ పేరు పెట్టుకోవడం జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ లాల్ మహారాజ్ జయంతి ని ప్రతి సంవత్సరం అధికారంగా నిర్వ హించడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వం లో మన తెలంగాణ ను లౌకిక రాష్ట్రంగా నిలుపు తున్నామని,కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. గిరిజన (లంబాడా) ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమములో రాష్ట్ర నాయకులు,నియోజకవర్గ గిరిజన ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :