సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నిజాంబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ఆదేశాల మేరకు ఇన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆర్మూర్ సిబ్బంది కలిసి సైప్తంగా నిర్వహిస్తున్న రోడ్ వాచ్ లో గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారంతో ఆర్మూర్ నుండి మునిపల్లి మార్గంలో గస్తీ నిర్వహిస్తుండగా రంజాన్ తండ్రి కేదార్ రామ్ అనే వ్యక్తి దొండా శివకుమార్ తండ్రి నాగరాములు అనే వ్యక్తి సహకారంతో టీఎస్ 16 ఎఫ్ జి 4576 నంబర్ గల ఎలక్ట్రానిక్ టు వీలర్ బండి పై 750 గ్రాముల గంజాయి తరలిస్తూ పట్టుబడడం జరిగిందన్నారు. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసి ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆర్మూర్ కు పంపించారు. ఈ గస్సిలో ఇన్ఫోర్స్మెంట్ సీ.ఐ స్వప్న, ఆర్మూర్ సీ.ఐ స్టీవెన్సన్, ఎస్సైలు ప్రమోద్, చైతన్య చంద్రమౌళి ఇన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎక్సైజ్ స్టేషన్ ఆర్మూర్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin