సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ : ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా సారా నిర్మూలన కై ప్రత్యేక డ్రైవ్ ని చేయాలని ఆదేశాల నేపథ్యంలో హుజుర్ నగర్ ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించి పలువురి ని అదుపులోకి తీసుకోవడమైనది.మొత్తం 9 వాహనాలు సీజ్ చేసి మొత్తం 12 మంది పై కేస్ నమోదు చేయడం అయినది.వీటి మొత్తం విలువ సుమారు 8 లక్షల రూపాయలు. ఈ దాడులు లలో పీక్లా నాయక్ తండా కు చెందిన గ్రామానికి చెందిన లావుడ్యా బుజ్జి తన ట్రాక్టర్ లో 5 బస్తాల పటికను 250 కిలో లు కొత్త తండా లో సప్లయ్ చేస్తుండగా ట్రాక్టర్ మరియు ట్రాలీ నీ సీజ్ చేయడమైనది.కొత్త తండా కు చెందిన బాణోత్ ఎలమంద 100 కిలో ల పటికను తరలిస్తుండగా అతని వాహనం ను సీజ్ చేయడమైనది.బుధవడా కు చెందిన గుగులోతు రమేష్ 150 కిలో ల పటికను తరలిస్తుండగా అతని వాహనం న సీజ్ చేయడం అయినది. బెట్టే తండా కు చెందిన అశోక్ అను వ్యక్తి 10 లీటర్ల సారా తరలిస్తుండగా ఆ వ్యక్తి వాహనము ను సీజ్ చేయడమైనది.దోనబండ కు చెందిన మాలోతు సైదా లీటర్ల సారా తరలిస్తుండగా అతని టీవీస్ ను సీజ్ చేయడమైనది. శివ బాలాజీ తండా కు చెందిన బానోతు సైదా 10 లీటర్ల సారా తరలిస్తుండగా అతని హీరో హోండా ను సీజ్ చేయడమైనది. బెట్టే తండా కు చెందిన ముగ్గురు వ్యక్తులు చత్రు, అశోక్, గణేష్ తమ బజాజ్ ఆటో లో 250 కిలో ల పటికను సీజ్ చేయడం అయినది.దొండపాడు లో తనిఖీ లలో 100 కిలో ల పటికను వాహనం తో స్వాధీనం చేసుకోవడమైనది.వ్యక్తి పరారీ లో ఉన్నాడు.మట్టపల్లి గ్రామానికి చెందిన ధర్మేంద్ర అను వ్యక్తి తన రేనాల్డ్ క్విడ్ కార్ లో మద్యం ఉంచి ఆంధ్ర కు తరలించే ప్రయత్నం లో ఉండగా ఆ వ్యక్తి నుండి 105 సీసాలు తో పాటు అట్టి కార్ ను సీజ్ చేయడమైనది.వివిధ కేస్ లలో సుమారు 15 మంది తహసీల్దార్ ల ముందు బైండ్ ఓవర్ చేయడమైనది.ఇట్టి దాడులు లో ఎస్ ఐ లు జగన్మోహన్ రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్ ల తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin