సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ భారత జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ పాల్గొన్ని వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పేద ప్రజల కోసం ఈ-శ్రమ్ కార్డు, ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ యోజన, కిసాన్ సమయజ్ యోజన ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టారని, వాటి ద్వారా దేశంలో చాలామంది ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సోషల్ మిడియ కన్వీనర్ గంథం సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామరాజు, మడుగుల లక్ష్మి నారాయణ, గంగసాని నారపరెడ్డి, కొప్పుల శంభిరెడ్డి తదితురులు పాల్గొన్నారు.
-----------------------
Admin