సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పార్టీ మారే ప్రసక్తి లేదని, కొత్తగూడెం నుండి బిజెపి అభ్యర్థులుగా రంగం లో ఉంటానని బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యాలయంలో కోనేరు సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ కొత్తగూడెం లో బిజెపి అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అవినీతి లేని అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తా అన్నారు. ప్రస్తుత దళిత బందు కానీ.... బి.సి. బందు కానీ.. డబుల్ బెడ్ రూం ఇండ్ల లో కానీ స్థానిక శాసన సభ్యుడు తనయుడు పూర్తి గా అవినీతి కి పాల్పడుతున్నారనీ విమర్శించారు.రానున్న రోజుల్లో కొత్తగూడెం లో ప్రతి మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ను కలుస్తా అన్నారు. బి జె పి పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కొత్తగూడెం లో అధికార బిఆర్ఎస్ పార్టీ లో... కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుందన్నారు. వయస్సు మళ్ళిన వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు మళ్ళీ నేనే పోటీ కి సిద్దం అంటున్నారని, ప్రజలు తిరస్కరిస్తారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనే అవినీతి లో కొత్తగూడెం ఎంఎల్ఎ నెంబర్ లో ఉన్నాడన్నారు. ఈనెల 18 వ తారీకు నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన పై బిజెపి కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతించాలన్నారు. కిషన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సెప్టెంబర్ లో ప్రధాని పర్యటన ను విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు.
-----------------------
Admin