Wednesday, 29 July 2026 04:48:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వ్యవసాయ కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి డిమాండ్... - వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడు

Date : 31 July 2023 10:03 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు,ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలైన వ్యవసాయ కార్మికులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగిన స్థానం కల్పించకుండా కార్పొరేట్ వ్యవసాయాలకు మద్దతు పలుకుతుందని చిన్న సన్నకారు రైతులు కేంద్రంపై పోరాటలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు పండించిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో పాటు పండిన పంటను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని,ముఖ్యంగా జిల్లా వ్యాపితంగా ఉన్న పోడు భూముల రైతులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించడం లో తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అభివృద్ధి పేరుతో ప్రతి ఏటా నిధులు కోత విధించడం విచారకరమని వ్యవసాయం యాంత్రికరణ అవుతున్నందున చేతినిండా పని లేక వ్యవసాయకార్మికులు వలసలు పోయే దుస్థితి దాపురించిందని ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులను నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాల పై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన చేస్తుందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల జీవన విధానం పై సమగ్ర సర్వే నిర్వహించి వారిజీవిత భద్రత కొరకు,తగు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక కుటుంబాల వారికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జడ వెంకన్న,కందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: