సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరుగుతుందని ప్రజల్లో భరోసా కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ ప్రాంగణాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీపీ పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు గౌరవమర్యాదలు తీసుకవచ్చే విధంగా అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని, రౌడీ షీటర్ల పట్ల మేతక ధోరణితో వ్యవహరించవద్దని. ఫిర్యాదులు వచ్చిన తక్షణమే స్పందించాలని. నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని సీపీ అధికారులు, సిబ్బందికి సూచించారు. చివర సీపీ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి కవిత, ఏ. ఎస్పీ శుభం ప్రకాష్, ఇన్స్ స్పెక్టర్ రమేష్ తో పాటు ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Reporter