Wednesday, 29 July 2026 07:19:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రుణమాఫీ ఏకకాలంలో చేయాలని వినతి...

Date : 27 June 2023 12:45 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడుమండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతుసంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు హామీలను ఇస్తూ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అది కూడా అమలు కావడం లేదని రుణమాఫీ అమలు కాకపోవటం వల్ల రైతులపై తీవ్ర వడ్డీ భారం పడుతున్నదని కొన్ని బ్యాంకుల్లో రైతుబంధు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారని ఆయన ఆవేదనవ్యక్తంచేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయలు లోపు రుణము రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని, లేని యెడల రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ధర్నా అనంతరం తాసిల్దార్ శ్రీదేవి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్ పిఎసిఎస్ వై చైర్మన్ పగడాల మట్టేశ్,రైతునాయకులు ఎర్రడ్ల మల్లారెడ్డి ఆర్లపూడి వీరభద్రం గుర్రం ధనమూర్తి,మాజీ సర్పంచ్ మీసాల కాశయ్య కొండా పెద్దఎల్లయ్య,కీసర మల్లయ్య,చాపలమల్లయ్య, ఏసురత్నం తదితరరైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :