సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారి ఆదేశాల మేరకు దేవరకొండ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకనుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించడంతో.. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భూమిక పోషిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. గల్లి నుండి ఢిల్లీ దాకా అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు రమావత్ హిమవంత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షుడు టీవీన్ రెడ్డి,వైస్ చైర్మన్ రహత్ అలీ,బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, గాజుల రాజేష్,పొన్నబోయిన సైదులు,బోడ్డుపల్లి కృష్ణ,నేనావత్ శ్రీను,తౌఫిక్ ఖాద్రీ,పొట్ట మధు,వాస వెంకటేశ్వర్లు,వాజిద్ పాషా,సత్తార్,లింగం,వినోద్,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin