సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల ఎం కొత్తపల్లి దగ్గర శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలో శ్రీ విద్యాగణపతి సన్నిధిలో జ్యేష్ఠ మాసం ఏకాదశి అశ్విని నక్షత్రం శుభసందర్బముగా భక్తిశ్రద్దాలతో అక్షరాభ్యాసం కార్యక్రమం ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రావ్యలతో అభిషేకాలు,శ్రీ సుబ్రహ్మణ్యంస్వామి వారికి పుష్పాభిషేకం పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీ విద్యాగణపతి సన్నిధిలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ మంత్రోచ్చారణలతో అక్షరాభ్యసం పూజలు నిర్వహించగా తహసీల్దార్ కుంకుంట్ల శ్రీధర్ ముఖ్యఅతిధిగా హాజరై కదిరి పట్టణానికి చెందిన దాత రిటైర్డ్ హెచ్ఎం కుమారుడు కోడూరు శ్రీకాంత్ అందించిన పలక, బలపాలను దాదాపు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 223 మంది చిన్నారులతో పాల్గొన్న తల్లిదండ్రులకు పంపిణి చేశారు.డీలర్ల సంఘం నాయకులు ఎద్దుల వెంకటరంగారెడ్డి అన్నదానం ఏర్పాటు చేయగా,మీసేవ సుధాకర్ తీర్థప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో ఏఎస్ఐ కే.కిషోర్ రెడ్డి,మాజీ కోఅప్షన్ సభ్యులు టైలర్ నిజాం,ఆలయ సేవకులు సిసి కెమెరా శంకర్,గణేష్, సోము, గంగాధర్,సుదర్శన్ రెడ్డి, పాండు,మోహన్ రెడ్డి,ఆటో సోము,మల్లెల రమేష్, నర్సింహా,వీఆర్వో శ్రీలత, నరసింహులు,కొండయ్య, అంగన్వాడీ కార్యకర్తలు,ఎం. కొత్తపల్లి, వడ్డివారిపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin