Wednesday, 29 July 2026 05:42:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేశంపేటలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజన్న చిత్రపటాలకు పాలభిషేకం...

Date : 03 August 2023 11:57 PM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతన్న అని అలాంటి రైతన్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగడుగునా అండగా నిలుస్తూ రైతులను రాజు చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు పరుస్తున్నారని షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. రైతుల రుణమాఫీ సెప్టెంబర్ రెండవ వారంలోపు లోపు పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేశంపేట మండలంలో సీఎం కేసీఆర్ తోపాటు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ.19,000 కోట్ల రుణాలను రైతుబంధు తరహాలో సెప్టెంబర్ రెండవ వారంలోపు మాఫీ చేయాలంటూ ఆర్థిక శాఖతోపాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు. గతంలో రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేసేవారని కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పెట్టుబడి సాయంగా రైతుబంధు ద్వారా నిధులు ఇస్తూ ఎరువులు, విత్తనాలను సైతం అందజేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి 24గంటల నిరంతర విద్యుత్ అందజేయడంతోపాటు పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తలసాని నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటరెడ్డి, కృష్ణ యాదవ్, నవీన్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, జి.కృష్ణయ్య, శ్రీలత శ్రీనివాస్, ఆంజనేయులు, సావిత్రి బాలరాజ్, కళమ్మవెంకటయ్య, ఎంపీటీసీలు దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య, మల్లేష్, యాదయ్య, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, సీనియర్ నాయకులు శేఖర్ పంతులు, పర్వత్ రెడ్డి, యారం శేఖర్ రెడ్డి, సిలివేరు మల్లయ్య, మన్మథరెడ్డి, కొత్తపేట జగన్ రెడ్డి, జగత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :