Wednesday, 29 July 2026 03:15:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు...

Date : 04 March 2023 12:02 AM Views : 783

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా నియోజకవర్గ సింగరేణి మండలం మాదారం, పేరేపల్లి, జమాలపల్లి గ్రామాలలో సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వై.ప్రకాష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెంచడం మూలంగా సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపై మోయలేని అదనపు భారం పడుతుందని, వంట గ్యాస్ కు 50 రూపాయలు వాణిజ్య గ్యాస్ కు 350 రూపాయలు పెంచి ప్రతిరోజు లక్షలాది రూపాయల భారం పేద ప్రజలపై మోపుతున్నార మండిపడ్డారు. ఇప్పటికే నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీల మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ములిగే నక్క మీద తాటికాయపడిన చందంగా మోడీ పాలనలో 2014లో 460 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 9 సంవత్సరాల కాలంలో 13 సార్లు రేట్లు పెంచి 1250 రూపాయలకు గ్యాస్ బండ ధరను పెంచడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు కూడా రద్దుచేసి తన నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసుకున్నారని దీని మూలంగా నిత్యవసరకుల కూడా విపరీతంగా పెరిగి ప్రజల పరిస్థితి జీవించలేని పరిస్థితిలోనికి నెట్టబడతారని, కావున పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి సబ్సిడీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో ప్రజలందర్నీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, వై జానకి, బాదావత్ వీరు ఎర్రయ్య, ఆలయం గురువయ్య, గడ్డం వెంకన్న తిరుమలగిరి నరేష్, సురేష్ ఆలయం రాంబాబు, బైరుమల్ల లక్ష్మయ్య, నిదిగొండ సతీష్, శివయ్య నరసింహారావు, కావేటి నాగేశ్వరరావు, బాటయ్య ఆలయం చంద్రయ్య, ధనసరి లక్ష్మి, ఆలయం బుజ్జమ్మ, నాగమణి వెంకటమ్మ, కొండమ్మ శిలుముల లక్ష్మి, రమాదేవి నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :