సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలోని అల్లీపురం, కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్ వైజర్ నిర్మల సూచనలు మేరకు అంగన్వాడి టీచర్లు సంతోష్ కుమారి ,రాజ్యలక్ష్మి మంజుల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీ మంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంగన్వాడి కేంద్రాల్లో అన్న ప్రసన్నం, అక్షరభ్యాసం, శ్రీమంతం, పుట్టిన రోజు వేడుకలు లాంటి కార్యక్రమాలను అంగన్వాడి సెంటర్లో నిర్వహించుకోవాలని, గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించాలని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలోతు సుజాత సక్రు నాయక్, కార్యదర్శి అంజన్ కుమార్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, గ్రామ ప్రజలు, మహిళలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin