Thursday, 30 July 2026 04:48:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"దేశ్ కు బచావో మోడీ కు హాటావో" ఫిబ్రవరి 16 సమ్మె కు జయప్రదం చేయండి

Date : 12 February 2024 08:40 AM Views : 341

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కనీస వేతనం,కార్మిక చట్టాల,ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ,సామాజిక భద్రతా చట్టం అమలు కోసం ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త సమ్మె పాల్గొనడం ద్వారా దేశాన్ని రక్షించుకుందాం - మోడీ ని గద్దె దింపుదాం అంటూ ప్రతిన బునాలనిసిఐటియు   జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ అన్నారు. కొత్తగూడెం పట్టణం లో సిఐటియు   నాయకత్వం సిఎంఆర్,జివి మాల్, హోండా షో రూమ్,సూపర్ మార్కెట్ గోడౌన్ లలో కార్మికులను కలిసి సమ్మె కరపత్రాలు పంచి,ప్రధానమంత్రి సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో ఎ.జె.రమేష్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలం లో కార్మిక వర్గ హక్కులను కాలరాసే విధంగా బహిరంగంగానే కార్మిక చట్టాలను మార్చేసి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చిన ఘనత నరేంద్ర మోడీ కె దక్కుతుందని అన్నారు. కాకులకు కొట్టి గద్దలకు వేయడమంటే కార్మికులు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే,ఒక రోజు కి 175 /- చాలని మోడీ చెబుతూనే, మరో పక్క గత సంవత్సరం లో అదానీ,అంబానీ లకి కేంద్ర ప్రభుత్వం 24 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను మాఫీ చేయడమే కాక,కార్పొరేట్ పన్నులను పెద్ద ఎత్తున తగ్గించిందన్నారు. ఎటువంటి సామాజిక భద్రత లేకుండా కార్మికులు పని చేస్తున్నారని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ని తెచ్చిన మోడీ ప్రభుత్వం యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, యాజమాన్యం వారికి వారే సెల్ఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చే కొత్త పద్ధతిని పట్టుకు వచ్చారని అన్నారు.మహిళా కార్మికులకు టాయిలెట్స్ సౌకర్యం,మెటర్నిటీ సెలవు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మొత్తం కార్మికులకు అత్యధిక పని ప్రాంతాలలో రెస్ట్ రూమ్స్ లేవని,సైకిల్ స్టాండ్స్ కూడా లేవని అన్నారు. ఆదివారాలు,పండుగ సెలవులు కూడా రాను రాను తీస్తున్నారని అన్నారు. అత్యంత దుర్బర పరిస్ధితులలో పని ప్రాంతాలలో కార్మికులు పని చేస్తున్నారని, ఇది వారి రోజు వారి జీవనాన్ని ప్రభావితం చేస్తున్నదని అన్నారు.కార్మిక సమస్యలపై ఈ కాలంలో దేశమంతా పోరాటాలు,ఉద్యమాలు అట్టుడుకుతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే,ఫిడేలు తీసుకుని వాయించుకున్నట్లు గా మోడీ వైఖరి ఉన్నదని విమర్శించారు.గత పది సంవత్సరాల కాలం లో మోడీ విధానాలు వల్ల వచ్చిన అసంతృప్తి ని పోరాటాల వైపుకు రానివ్వకుండా మతం,కులం,ప్రాంతం పేరున అనేక సమస్యలను ముందుకు తెచ్చి,భావోద్వేగ అంశాలపైన దేశమంతా చర్చ జరిగితే చేశారని,నిజమైన కార్మిక,రైతాంగ,ప్రజల సమస్యలపై ఏ రకమైన చర్చ లేకుండా చేశారన్నారు. ఫిబ్రవరి దేశ వ్యాప్త సమ్మె సైరన్ తో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఇంటికి పంపించె పనికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలలో సిఐటియు   పట్టణ కన్వీనర్ డి.వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, లిక్కీ బాలరాజు,ఆయా రంగాల నాయకులు లక్ష్మన్, ప్రవీణ్, వెంకట్, శేఖర్,సుందర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: