Wednesday, 29 July 2026 02:05:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని 8వ రోజు సీతారాంపేటలో ప్రారంభమైన పాదయాత్ర.

Date : 20 February 2023 03:21 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మరికల్ మండలం, చిత్తనూరు శివారులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని గత సంవత్సరానికి పైగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పలు రూపాల్లో ఉద్యమిస్తున్న పట్టించుకోకుండా కంపెనీ యజమాని వైపు ప్రజా ప్రతినిధులు, అధికారులు నిలబడడం శోచనీయం. ఓట్లు వేసిన ప్రజల వైపు పాలకులు ఉండకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఒకరిద్దరూ బడా బాబుల వైపు నిలబడటం దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాపారవేత్తలే ప్రభువులు అయినట్లు వారికి కనబడుతున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలని ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమాలు జరిగినప్పటికీ మరింత విస్తృతంగా ప్రజల్లోకి కంపెనీ యొక్క కష్టనష్టాలను ప్రజలకు తెలియజేయడానికి ఈనెల 11వ తేదీన పాదయాత్రను చిత్తనూరు లో మొదలైన ఈరోజు సీతారాంపేటలో 8వ రోజు మొదలైన పాదయాత్ర నెల్లికొండి చిన్న వడ్డెమాన్ వడ్డేమాన్ ఏదిలాపురం చిన్నచింతకుంట మండలం మద్దూర్ కి ఈరోజు చేరుకుంటుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వైపు నిలబడి ఇథనాల్ కంపెనీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో భవిష్యత్తులో జరిగే తీవ్రతరమైన పోరాటాలకు పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో ఈ నెల 21 తారీకున ఆత్మకూరులో పాద్రాయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాదయాత్ర లో పాల్గొన్న చిత్తూనూరు, కన్మనూరు, రాంపూర్ గ్రామాల రైతులు, మహిళలు ఇంకా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అఖిల భారత కన్వీనర్ బండారు లక్ష్మయ్య ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి , రాష్ట్ర నాయకులు ఈరపాగ గోవిందు, కులనిర్మూలన పోరాట సమితి కార్యవర్గ సభ్యులు బండారి నర్సప్ప, రమేష్ ,మహదేవ్, టి ఎఫ్ టు యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, యాదగిరి, బి ఎస్ పి పార్టీ దేవరకద్ర నియోజకవర్గం ఇంచార్జి సంతోష్ రెడ్డి , నియోజకవర్గ అధ్యక్షులు విజయకుమార్ , చిన్న చింతకుంట అధ్యక్షులు రవీందర్ పాదయాత్ర లో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :