సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో కదిరి పాత్రికేయులపై పెట్టిన కేసులకు తక్షణమే ఎత్తివేయాలని ఏఎస్పీకి రామకృష్ణ ప్రసాద్ కి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతి అందజేశారు. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.జిల్లా పోలీస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పాత్రికేయులు.శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఐదు రోజుల క్రితం సిఐ ఇంటి వద్ద టిడిపి శ్రేణులు చేసిన ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా పాత్రికేయులు పైనే కేసులు పెట్టారని, తక్షణమే ఆ కేసులు ఎత్తివేయాలని ఐజేయు, ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో పాత్రికేయులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పి రామకృష్ణ ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కదిరిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి విధినిర్వహణలో భాగంగానే పాత్రికేయులు అక్కడికి వెళ్లారని ఈ క్రమంలో సిఐ మధు ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు. అక్కడి ఘటన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని మొబైల్ ఫోన్లు లాక్కొని పాత్రికేయులు పట్ల సీఐ మధు దురుసుగా ప్రవర్తించినట్లు ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు అయ్యన్న శ్రీనివాసులు ఏఎస్పీకి వివరించారు. కదిరి రిపోర్టర్లు షబ్బీర్, సోమశేఖర్, రాము, బాబ్జాన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి ఖండిస్తున్నామని తెలిపారు.రిపోర్టర్ల పై దాడులకు పాల్పడిన పోలీసుల పైన అందుకు కారణమైన సీఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి విన్నవించారు. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు. విధి నిర్వహణలో పాత్రికేయులకు భద్రత కల్పించాలని తెలిపారు...
-----------------------
Admin