సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లాలోని హనుమకొండ టిబి యూనిట్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 10 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ దాతల సహకారంతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా.. DMHO Dr సాంబశివరావు గారు, జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్ హిమబిందు గారు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, మరియు రెడ్ క్రాస్ సొసైటీ Dr విజయ్ చంద్ర రెడ్డి హనుమకొండ జిల్లా చైర్మన్ గారు మరియు స్టేట్ ఎం.సి శ్రీనివాస్ గారు పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపం కారణంగా క్షయవ్యాధి ఆలస్యంగా తగ్గే అవకాశమున్నందున స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు పౌరులు ముందుకు వచ్చి టీబీ రోగులకు చేదోడుగా నిలబడాలని కోరారు. రోగులకు ఫుడ్ కిట్స్ అందించేందుకు చొరవ చూపిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులను DMHO Dr సాంబశివరావు గారు మరియు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు గారు అభినందిం చారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్య నిర్వాహక సభ్యులు, ఉద్యోగులు మరియు జిల్లా టీబీ కో-ఆర్డినేటర్ కిరణ్ కుమార్, హనుమకొండ TU TB సూపరవైజర్ విజయ్ కుమార్, జనార్ధన్ మరియు జిల్లా టిబి నియంత్రణ విభాగ సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin