Tuesday, 15 September 2026 11:35:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏప్రిల్ 17 నుండి సమ్మె బాట పట్టనున్న విద్యుత్ ఉద్యోగులు...

Date : 14 April 2023 12:54 AM Views : 560

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం అవుతున్నమని పిఆర్సి అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు(1104 యూనియన్) తెలియజేశారు. గురువారం ఈ బయ్యారంలో గల విద్యుత్ సబ్స్టేషన్ లో కరకగూడెం మణుగూరు ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1999 మరియు 2004 మధ్య నియమించబడిన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ ను జీపీఎఫ్ సదుపాయంగా మార్చడం, విద్యుత్తు వినియోగాల్లోని చేతివృత్తుల వారి డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగిందన్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘంపై యాజమాన్యం వైఖరి పట్ల ఉద్యోగులు నిరాశ చెందారని జేఏసీ నాయకులు తెలిపారు. చివరగా, యాజమాన్యం , టీఎస్పీఈ జేఏసీ మధ్య చర్చలు విఫలమవడంతో ఏప్రిల్ 17 నుండి సమ్మె చేయాలని అత్యవసర సమావేశం నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసిన సమ్మెకు వెనక్కు తగ్గమని తెలియజేశారు.విద్యుత్ యాజమాన్యాలపై విశ్వాసంతో సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఓర్పుతో వ్యవహరించామని తెలిపారు. వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా మేనేజ్​మెంట్​నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనివార్యంగా ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించి నోటీసు అందజేశామని తెలిపారు. సమ్మె ను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే విద్యుత్ ఉద్యోగులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జరిపే సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్, డీఈ జీవన్ కుమార్, కో చైర్మన్ బి రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ వెంకటరాజు(సీఐటీయూ), ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉదయ్ రత్న కుమార్, ఉద్యోగుల సంఘం బీసీ నాయకులు సీతారాములు, ఉద్యోగుల ఓసి అసోసియేషన్ నాయకురాలు, ఈ.బయ్యారం ఏఈ కావ్య, విద్యుత్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: