Sunday, 13 September 2026 01:45:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కెసిఆర్ సార్ అమ్మ నాన్న లేని అనాథలం మాకూడ దళిత బంధు ఇవ్వండి...

Date : 14 September 2023 08:01 AM Views : 291

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన వంగూరి సంధ్య (20) మరియు వంగూరి దివ్య (19) SC(మాదిగ) అనే ఇద్దరు అనాథ అక్క చెల్లెలు 20 సంవత్సరాల లోపు వయసు వారే. ఒకరేమో ఇంటర్ పూర్తి చేసినారు.మరొకరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నరు. వాళ్లు 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తల్లి వంగూరి రేణుక రొమ్ము క్యాన్సర్ తో చనిపోయింది. దాని తరవాత కొద్ది కాలానికే తండ్రి వంగూరి కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. ఆయన అలన పాలన ఈ ఇద్దరు పిల్లలే చూసుకుంటూ ఇద్దరు చదువుకుంటూ కులిపనులు పనులు చేస్తూనే ఇంతకాలం తండ్రిని సాదుకుంటు వచ్చారు. నెల రోజుల క్రితం(06 ఆగస్ట్ 2023) నాడు తండ్రి కూడా చనిపోయాడు. ఇలా తాము ఇంత చిన్న వయసులోనే తల్లిదడ్రులిద్దరూ చనిపోవటం ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.చివరికి తండ్రి అంత్యక్రియలు కూడా సొంత ఖర్చులతో జరపాలేని పేదరికం లో ఉన్న ఆ అక్క చెల్లెలకి మానవత్వం ఉన్న కొంత మంది అండగా నిలిచి కొంత ఆర్థిక సహకారం అందించటం తో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.ఇప్పుడు తమకి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయామని బోరున విలపిస్తున్నారు.తమకి అస్తి పాస్తులు కూడా ఏమీ లేవని తమ మంచి చెడూ చూసుకునే వారు కూడా ఎవరూ లేకపోవడంతో అమ్మ నాన్న లేని ఇద్దరు అనాథలు అయిన ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తమకు కేసిఆర్ ఏ పెద్దదిక్కు కావాలని తమ కాళ్లపై తాము నిలబడి బ్రతకడానికి,స్వయం ఉపాధినీ ఎంచుకొని తమ జీవనం కొనసాగించటానికి రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఎదుగుదల కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తమకు ఒక యూనిట్ నీ కేటాయించి కెసీఆర్ గారే తమకు అండగా నిలవాలని కోరుకుంటూ బుధవారం రోజు తమ బాధని పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉత్తరం పంపారు.ఎంతో మందికి దళిత బంధు పథకం ద్వారా సహాయపడి వారి బతుకుల్లో మార్పులు తీసుకొచ్చిన కెసిఆర్ అమ్మ నాన్న లేని తమకి కూడా దళిత బంధు పథకం ఇచ్చి అమ్మ నాన్న అన్ని తానే అయ్యి తమ బతుకుల్లో మార్పులు తీసుకురావాలని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కూడా స్పందించి తమ చెల్లెల లాగా అనుకొని మాపై మానవత్వం చూపి మాకు అన్నలాగ ఉండాలని ఆ పిల్లలు వేడుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: