సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం అయిన సందర్బంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంబరాల్లో పాల్గొన్నారు... అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ ప్రజలతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండా పట్టుకొని టపాకాయలు కాల్చి సంబరాల్లో పాలుపంచుకున్నారు. మక్తల్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం అయిన వేళ మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అయినప్పటి నుండి మక్తల్ ను నియోజకవర్గ కేంద్రం గా ప్రకటించినప్పటికీ ఇక్కడ కోర్ట్ ప్రారంభం ఆలస్యమైందని, ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు కోర్ట్ కార్యకలాపాలు స్టార్ట్ కావడం సంతోషకరమన్నారు. 70 ఏళ్ళ తర్వాత మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా స్థానికుడే ఎన్నిక కావడంతోనే ఇది సాధ్యమైందని మంత్రిని ప్రజలు అభినందించారు. కోర్ట్ ప్రారంభానికి భవనం లేక పోవడం తో మంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. కోర్ట్ ప్రారంభం సందర్భంగా హై కోర్ట్ సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి ద్వారా మంత్రి వాకిటి శ్రీహరి కోర్ట్ కు ఒక జ్ఞాపికను బహుకరించారు.
-----------------------
Admin