Wednesday, 29 July 2026 09:26:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆశీర్వదించి ఆదరించండి..ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించండి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చాట్ల విజయ-రవీందర్ దంపతులు

Date : 29 November 2025 12:53 PM Views : 249

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ మొగుళ్లపల్లి మొగుళ్ళపల్లి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి, ఆదరించాలని, గ్రామ సర్పంచ్ గా గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చాట్ల విజయ-రవీందర్ దంపతులు మొగుళ్ళపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. శనివారం చాట్ల విజయ-రవీందర్ లు నామినేషన్ వేశారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ ప్రజాదారణ కలిగిన నాయకుల కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వేట కొనసాగించారు. ఈ క్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా పేరున్న చాట్ల విజయ-రవీందర్ ను మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. చాట్ల విజయ భర్త రవీందర్ మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ, నిరుపేద ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ..ప్రజలలో మంచి గుర్తింపు పొందాడు. కుల, మతాలకతీతంగా చాట్ల రవీందర్ చేస్తున్న సేవలను మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజలు నిరంతరం కొనియాడుతుంటారు. చాట్ల విజయ-రవీందర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ప్రత్యర్థి పార్టీలలో సర్పంచ్ గా పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరు ముందుకు రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే చాట్ల విజయ-రవీందర్ కు ప్రజలలో ఉన్న ప్రజాధారణ ఏంటో స్పష్టమవుతుంది. ప్రత్యర్థి పార్టీలపై ఆయన ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. ఏదిఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తన సేవలతో ప్రజల మనసును గెలుచుకున్న ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ రవి సతీమణి సర్పంచ్ గా పోటీ చేస్తుండడంతో ప్రజలంతా ఆమె వైపు మొగ్గుచూపడం విశేషం.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: