సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ అద్వర్యం లో గంజాయి నిర్మూలనలో జిల్లా సిబ్బంది కృషి చేస్తున్నారు అని తెలిపినారు. కేసు వివరాలను వెల్లడిస్తూ సూర్యాపేట పట్టణం ఎన్టీఆర్ పార్క్ వద్ద అనుమానంగా అపిఉన్న రెండు కార్లను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు, సిబ్బంది కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 24కేజీ గంజాయి, మరో కారులో 1kg ఉన్నది. ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా మరొవ్యక్తి పరారైయ్యారు అని తెలిపినారు. ఒకటవ నిందితుడు నాగుర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, వటవర్లపల్లి గమ్యానికి చెందిన చారగొండ ప్రకాష్, రెండవ నిందితుడు మిర్యాలగూడ, శాంతినగర్ కు.చెందిన తాల్ల సుమంత్ గా గుర్తించడం జరిగినది. భార్గవ రామ్ అనే నిందితుడు పరారైయ్యాడు. ప్రకాష్, సుమంత్ లకు గత 5 సం.లుగా స్నేహం ఉన్నది. నాగుర్ కర్నూల్ కు చెందిన ప్రకాష్ సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటాడు. మిర్యాలగూడ కు చెందిన సుమంత్ కు గంజాయి త్రాగే అలవాటు ఉన్నది, గంజాయి పండిస్తే హైదరాబాద్ లో అమ్మి ఎక్కువ లాభం వస్తదని సుమంత్ అనే నిందితుడు ప్రకాష్ కు తెలిపి పంట పండిస్తారు. రెండు రోజుల క్రితం పంట తెంపిన ప్రకాష్ సుమంత్ కు సమాచారం ఇవ్వగా 27వ తేదీన సుమంత్ కారులో ప్రకాష్ గ్రామం వటవర్లపల్లి కి వెళ్లి గంజాయి నీ కారులో పెట్టుకుని సుమంత్ అత్త గారు ఊరైన సూర్యాపేట కు రావడం జరిగినది. రాత్రి సూర్యాపేట లో ఉండి ఉదయం సుమంత్ కు స్నేహితుడైన హైదరాబాద్ కు చెందిన భార్గవ్ రామ్ కి ఫోన్ చేసి గంజాయి కావాలని అడుగి సూర్యాపేటకు రమ్మన్నారు. భార్గవ రామ్ సూర్యాపేట పట్టణం ఎన్టీఆర్ పార్క్ వద్దకు రమ్మగా వచ్చారు. ఇక్కడ అనుమానంగా ఉన్న వారిని పట్టుబడి చేసి 25కేజీల గంజాయిని, 2 కార్లు స్వాధీనం చేసుకోవడం జరిగినదని అదనపు ఎస్పీ వివరించారు.ఈ కేసులో బాగా పని చేసిన సీఐ రాజశేఖర్, ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్ ఐ లు సైదులు, రవీందర్, సి సి ఎస్ సిబ్బందికి, పట్టణ క్రైమ్ సిబ్బంది కి రివార్డ్ అందిస్తాం అని అదనపు ఎస్పి తెలిపినారు. ప్రెస్ మీట్ నందు పట్టణ సీఐ రాజశేఖర్, SI రవీందర్, సిబ్బంది కృష్ణ, కర్ణాకర్, సైదులు ఉన్నారు.
-----------------------
Admin