Wednesday, 29 July 2026 09:02:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

08 జిల్లాల్లో భరోసా కేంద్రాలను వర్చ్యువల్ గా ప్రారంభించిన రాష్ట్ర డీజిపి రవి గుప్తా...

Date : 07 February 2024 07:52 AM Views : 246

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మహిళలు,చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మంగళవారం రాష్ట్ర డీజిపి రవిగుప్తా డీజిపి కార్యాలయం నుండి 08 జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను వర్చ్యువల్ గా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం నుండి జరిగిన ఈ కార్యక్రమంలో ఉమేన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజిపి శిఖా గోయల్ , అడిషనల్ డీజిపి సీఐడి మహేష్ భగవత్, మల్టీ జోన్-1&2 ఐజీ తరుణ్ జోషి లు పాల్గొన్నారు. లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ "భరోసా సెంటర్" అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. హత్యాచార కేసులు, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే 'భరోసా' కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు. వీటితో పాటు ఈ భరోసా సెంటర్లలో బాధితులకు వివిధ రంగాలలో నైపుణ్యతను నేర్పించి,వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందన్నారు. అనంతరం భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను ఎస్పీ పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు ఒకేచోట అన్ని రకాల చట్టపరమైన సేవలను పొందేటందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,షీ టీం ఇంచార్జి ఎస్సై రమాదేవి, ఏ హెచ్ టి యు ఎస్సై శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, రాజువర్మ, 2టౌన్ సియి రమేష్, ఎస్సైలు నరేష్, సంతోష్, రవి, పురుషోత్తం, జుబేదా,విజయ, విజయకుమారి భరోసా టీమ్ సభ్యులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :