సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండలంలోని నల్లబండగూడెం రాంపురం క్రాస్ రోడ్డు వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో తెగిపోయిన నేషనల్ హైవే 69 విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారి ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ చందులాల్ పవర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిని సందర్శించారు . ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. మరో రెండు రోజులపాటు సూర్యాపేట జిల్లాకు వర్ష సూచన ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు నార్కెట్ పల్లి,నల్లగొండ, మిర్యాలగూడ,వయా గుంటూరు మీదుగా వెళ్లాలని తొందరలోనే నేషనల్ హైవే వారితో మాట్లాడి బ్రిడ్జి పునరుద్ధరించడం జరుగుతుందని ప్రయాణికులు పోలీస్ అధికారులకు స్థానిక అధికారులకు సహకరించాలని తెలియజేశారు.
-----------------------
Admin