Tuesday, 15 September 2026 01:07:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి...

Date : 12 September 2023 06:49 AM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్తెలిపారు. సోమవారం హైదరాబాద్ ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం 2023పై జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18, 19 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, కళాశాలల్లో తరచు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్యపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసి గ్రామాలలో ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తున్నట్లు జరుగుతుందని చెప్పారు. జనాభా, లింగ నిష్పత్తి ప్రకారంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కళాశాలలలో 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను నూతన ఓటరుగా నమోదు చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రావు, కొత్తగూడెం ఆర్డీవో శిరీష, భద్రాచలం ఆర్డీవో మంగీలాల్,ఎన్నికల రిటర్నింగ్ అధికారులుతదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: