సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *తెలంగాణ రాష్టంలో నిషేధిత గుట్కా, ఖైని, పాన్ మసాలా, జడ్దా లను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది* ప్రజారోగ్యన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం గుట్కా, ఖైని, పాన్ మసాలా, టొబాకో మరియు పొగాకు సంబంధిత నికోటిన్ కలిగిన వస్తువులను 24 మే 2025 న నిషేధించడం జరిగింది... అనేకమంది ఈ యొక్క హానికర వ్యసనం ద్వారా క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది... ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ నిషేధిత వస్తువులు తయారు చేసేవారిని, స్టాక్ చేసేవారిని, అమ్మేవారిని, కొనేవారిని అడిపులోకి తీసుకోని కఠినంగా వ్యవహరించిన ప్రజల ప్రాణాలు కాపాడాలి... గంజాయి మరియు డ్రగ్స్ ని ఏ విధంగా కట్టుదిట్టంగా నిషేదించరో అలాగే ఈ గుట్కా, ఖైని, పాన్ మసాలా, నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తులను అరికట్టాలని పోలీస్ వారికీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు... సర్కార్ టీవీ ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter