సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాఖీ పౌర్ణమి సందర్భంగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కు కాంగ్రెస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షా బంధన్ పర్వదినం సోదర సోదరీమణులు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు. వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, నియోజకవర్గంలోని ప్రతి అక్కకు, చెల్లికి పెద్దన్నగా నిలబడి సంక్షేమ పథకాల కేటాయించి తీరుతానని అన్నారు.
-----------------------
Admin