సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక ఈ సంవత్సరం అడ్మిషన్ ప్రారంభమయ్యాయని పేద విద్యార్థులు శ్రీ రామభద్ర ఐటిఐ కాలేజీలో జాయిన్ అయి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని విలేకరుల సమావేశంలో కాలేజీ నిర్వాహకులు పుల్లారావు సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటిఐ కాలేజీ ద్వారా పేద విద్యార్థులకు రాయితీలు ఉన్నాయని ప్లేస్మెంట్లు కూడా కాలేజీ తరఫున చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఏ ఇండస్ట్రీలో నైనా ఐటిఐ చదివిన ఫిట్టర్,ఎలక్ట్రిషన్ లే కీలక బాధ్యత వహిస్తారని తెలియజేశారు. ఐటిఐ ఫీట్టర్ ఎలక్ట్రిషన్ ఉంటే మిల్లు నడవడానికి ఆకాశం ఉంటుందని రామాభద్రా ఐటిఐ లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని వెల్లడించారు. గత 25 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో ఐటిఐ కాలేజీ నడుస్తుందని ప్రభుత్వ రాయితీలు కాలేజీ రాయితీలు అందిస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కాలేజీలో చేరాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin