సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రావి రాంబాబు మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ ను కలిసి డైలీ మార్కెట్ గురించి వినతి పత్రం అందించారు. ఈ వినతి పత్రం యొక్క సారాంశం ఏమిటంటే డైలీ మార్కెట్ టెండర్ గత ఆగస్టు నుండి అమల్లో ఉంది. డైలీ మార్కెట్ ను కాంట్రాక్ట్ రూపంలో పాట పాడుకుని చేయి దక్కించుకున్న కాంట్రాక్టర్ మాదా శ్రీరాములు ఆ పాట యొక్క పైకం మొత్తం చెల్లించినారా లేదా అడగడం జరిగింది. ఇంకా రెండు నెలలే కాల వ్యవధి ఉన్నందున మొత్తం 51 లక్ష రూపాయలు మున్సిపల్ సొమ్మును చెల్లించినారా లేదా అని అడిగారు ఒకవేళ చెల్లించని ఎడల వారి వద్ద నుండి రికవరీ చేయాల్సిందిగా కోరారు. ఈ విషయంపై కొత్తగా వచ్చిన కమిషనర్ ని రెండు సార్లు కలవడం జరిగింది . మూడోసారి కలవాలని వెళ్లగా వారు లేక మున్సిపల్ మేనేజర్ నీ కలిసి లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టారు. ఈ విషయంపై ప్రజలలో గందరగోళం నెలకొంది పాలకవర్గం మొత్తం కౌన్సిలర్లు కలిసి పైసలు తింటున్నారని అపోహ ఉంది. ఎవరెవరు డైలీ మార్కెట్లో భాగస్వాములై ఉన్నారో వారందరూ కలిసి మున్సిపాలిటీకి కట్టవలసిన పైకాన్ని వెంటనే చెల్లించి బిఆర్ఎస్ పార్టీ పాలకవర్గాన్ని బదనాం కాకుండా చూడాలని ఓపెన్ గా డిమాండ్ చేస్తున్నా అని రాంబాబు అన్నారు. ఈ మార్కెట్ 50 శాతం కు పైగా 33 వ వార్డులో ఉంది. కావున మున్సిపాలిటీ సొమ్ము వృధా కాకూడదని తన వార్డు నుండి మున్సిపాలిటీ కి వచ్చే నిధులను దొంగల దోచుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కావున వెంటనే వారి నుండి పైకం మొత్తం వసూలు చేయాలని లేనియెడల వారిపై కేసు నమోదు చేయాలని అన్నారు.
-----------------------
Admin