Sunday, 13 September 2026 01:43:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవ...

Date : 04 June 2023 12:24 AM Views : 588

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలో సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. షాద్నగర్ మున్సిపల్ కౌన్సిలర్ మాధురి నందకిషోర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రఘుపతిరావు, ప్రమోద్, సునీల్ పంతులు, భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఫరఖ్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన శంకరయ్య దంపతులు దంపతులు వారి కుటుంబ సభ్యులు దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పులిమామిడి శ్రీశైలం గౌడ్ శాలువా పూలమాలతో కౌన్సిలర్ దంపతులను, అన్నదాతలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బియ్యం దానం చేసిన తులసి రామ్ నాయక్ మరియు కూరగాయల దాత రాఘవేందర్ లను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పల్లకి సేవలో పులిమామిడి శ్రీశైలం గౌడ్, అన్నారం రఘు గౌడ్, రమేష్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, లక్ష్మణ్, కిషన్ నాయక్, రాఘవేందర్, రమేష్, సుప్ప నర్సింలు, నారాయణ, శ్రీనివాస్, కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకర్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, వీఆర్వో బచ్చన్న, సత్తయ్య, శ్రీనివాస్, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :