Wednesday, 29 July 2026 06:12:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ కరపత్రాలు విడుదల...

Date : 12 November 2023 01:26 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని, ఇకపై కేసీఆర్ ను నమ్ముకుంటే ముస్లింల బ్రతుకులు వీధిపాలు అవుతాయని అందుకే ముస్లిం మైనారిటీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేసిందని పిసిసి సభ్యులు షాద్ నగర్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తెలిపారు. శనివారం సాయంత్రం వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా.. ఇప్పటికే యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించామని తాజాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేశారని అన్నారు. ఈ సందర్భంగా బాబర్ ఖాన్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. వక్ఫ్‌ భూములను కాపాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ ముఖం చాటేసారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. మైనార్టీ డిక్లరేషన్​లోని ముఖ్యంశాలు. మైనార్టీలకు ఆర్థిక ఉద్ధరణ, సాధికారత 6 నెలల్లోపు కుల గణనను చేపట్టి. ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనార్టీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు మైనార్టీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం ఎంఫిల్‌ చేసిన మైనార్టీ యువతకు రూ.5 లక్షల సాయం పీహెచ్‌డీ, పీజీ చేసిన మైనార్టీ యువతకు రూ.లక్ష సాయం సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏర్పాటుకు హామీ మైనార్టీ సంస్థల్లో ఖాళీల భర్తీకి హామీ ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ అన్ని మతాల పూజారులకు నెలకు రూ.10 నుంచి రూ.12 వేల గౌరవ వేతనం ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి ఇళ్లులేని మైనార్టీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మైనార్టీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు పాత బస్తీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ లాంటి కీలక హామీలున్నాయి. ఈ సమావేశంలో స్థానిక మైనార్టీ నాయకులు జమ్రుద్ ఖాన్, అసద్ ముఫ్తార్ అలీ, సయ్యద్ ఖదీర్, గోరి, ఆలీం శకీబ్, జాంగిర్ తదితులున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :