సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం నిమ్మ తండ గ్రామంలో భానోతు తిరుపతమ్మ వృద్ధ మహిళా మరణించడంతో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న వారి కుటుంబన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. పిల్లుట్ల రఘున్న అభిమానులు అందరూ కలిసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న మాట్లాడుతూ గత మూడు నాలుగు సంవత్సరాల కాలాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా అనేక పేదల కుటుంబాలను ఓజో ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా ఆదుకున్నామన్నారు.. తమ అభిమాన నాయకుడు పిల్లుట్ల రఘున్న అలుపెరుగని ప్రజాసేవే లక్ష్యంగా నిద్రరారాలు మాని ప్రజలకు అనేక సేవకార్యక్రమాలు చేస్తూ, భవిష్యత్తులో ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజా సేవలు ఉదృతం చేసేందుకై సింహం గుర్తుతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలందరూ తప్పకుండా పిల్లుట్ల రఘున్న గెలుపుకు ఆస్వాదం పలకాలని అన్నారు.. ప్రజలు కూడా మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి మంచి చేసే పిల్లుట్ల రఘున్న వైపు నిలబడాలని అన్నారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్లే నాయకులు నమ్మవద్దని, వారు ప్రజా ఓట్లను దుర్వినియోగం చేసి పార్టీని మారుతున్నారని అన్నారు. అటువంటివారు మరల వచ్చి ఓట్లు అడుగుతారు.. అటువంటి వారికి ప్రజలు చెప్పుతో బుద్ధి చెప్పాలని అన్నారు.. ఏదేమైనా మంచి కోసం పాటుపడే వ్యక్తిగా, ప్రజలు నియోజకవర్గంలో మార్పును కోరుకొని సింహం గుర్తుపై ఓటు వేసి పిల్లుట్ల రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని నియోజవర్గంలో చరిత్ర సృష్టించాలని కుక్కల వెంకన్న అన్నారు.ఈ కార్యక్రమంలో యల్లవుల శివ శంకర్ యాదవ్, బోమ్మకంటీ సైదులు ముదిరాజ్, హర్యనాయక్, రాంబాబు, టికం, నాగరాజు, నాగేందర్, నగేష్, నాగు,మఠంపల్లి మండల ఎ ఐ ఎఫ్ బి పార్టీ ఇన్చార్జులు, గ్రామస్తులు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin