Monday, 14 September 2026 12:45:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలుస్తాం... - పిల్లుట్ల రఘు

Date : 02 November 2023 11:22 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం అనుములగూడెం, లక్కవరం, శ్రీనివాసపురం, అమరవరం గ్రామంలో ఎఐఎఫ్ బి సింహం గుర్తు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటన చేశారు. గత మూడు నాలుగు సంవత్సరాల కాలం నుంచి అలుపెరుగని ప్రజా సేవలతో ప్రజల మనసులను దోచుకున్న పిల్లుట్ల రఘుకు ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారు .. కేవలం నాయకులు అధికారానికి మాత్రమే పరిమితమయ్యారని, కానీ పిల్లుట్ల రఘులా సేవ చేసే నాయకుడిని ఇంతవరకు మేము చూడలేదని ప్రజలు అనడం సమంజసం. గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు వింటూ ప్రజలకు భరోసానిస్తూ, ఊరి సమస్యలు తెలుసుకుంటూ తన ప్రచారాన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాలలో ప్రజా సమస్యలు ఉరి సమస్యలు లేని నియోజవర్గంగా చేస్తాను అన్నారు. అధికార హోదాతో నాయకులు సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని, నియోజకవర్గంలో దోపిడి దారులు,దొంగల ముఠాలు ఎక్కువైనాయని, ప్రజలకు అందాల్సిన ప్రతిఫలాలు అందకుండా వారు అడ్డుపడుతున్నారని అన్నారు. నాయకుల చేతుల్లో మోసపోతున్న అమాయక ప్రజలను చూసి తాను ప్రత్యక్ష రాజకీయా రంగ ప్రవేశం చేశాను అని, ప్రజాస్వామ్య పాలనకు పార్టీలతో పనిలేదని ప్రజలను మంచిగా పాలించే తనలాంటి నాయకుడు కావాలని రఘు అన్నారు. ప్రజల ఓట్లను దుర్వినియోగం చేస్తు, అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు పార్టీ లు మారుతున్నారని అన్నారు. వాళ్ళు పార్టీలు మారితే ప్రజల పార్టీలు మారినట్లా? ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పి సింహం గుర్తుకు ఓటు వేసి మంచి వైపే మేము అని నిరూపించి, పార్టీ మరే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి అని అన్నారు.. ప్రచారంలో భాగంగా అక్క చెల్లెమ్మలు ఆప్యాయంగా పలకరిస్తూ నియోజవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా పిల్లుట్ల రఘున్న అన్న మా ఊరు వచ్చాడు పలకరించే విధానం చూస్తే మహిళామూర్తులు అందరు రఘున్న ఎమ్మెల్యే పాలన కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది అని అన్నారు. ఏదేమైనా నియోజవర్గంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలలో అలజడి మొదలైందని సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలకు చరమగీతం పాడుతానని తెలిపారు.. ఈ అధికారం నాయకుల పాలనలో పల్లెటూర్లలో కనీసం తాగునీటి వసతి కూడా లేదని, రోడ్ల వ్యవస్థలు,బాగాలేదు, పారిశుధ్యం,మరుగునీటి సౌకర్యం కూడా బాగాలేదని కనీసం వసతులు తీర్చలేని వాళ్ళ మనల్ని ఇన్ని రోజులు పాలించినారా అనిపిస్తుంది. ఒకరేమో 30 సంవత్సరాల సీనియార్టీ అని, ఇంకోరేమో 3500 కోట్ల అభివృద్ధి అని ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెబుతున్నారు.. ప్రజల్ని మోసం చేసింది ఇక చాలు.. సామాన్యుల పరిస్థితి మరి దుర్భరంగా తయారైంది. నాయకులు వాళ్ళని బెదిరించి ఓట్లు దండుకొని దుర్మార్గ చర్యలకు పాల్పడి బిసి బంధు, దళిత బంధు, డబల్ బెడ్ రూమ్, రైతుబంధు,రైతు బీమా పార్టీలకు కొమ్ములు కాసేవారికి అందిస్తున్నారని రాబోయేది పిల్లుట్ల రఘున్న రాజ్యమని, స్వార్థం లేని పాలలను ప్రజలకు అందించి, ప్రతిఫలాలు అందరికీ అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు దీటుగా పిల్లుట్ల రఘు సొంతంగా మేనిఫెస్టోను రూపొందించి నియోజకవర్గం ప్రజలకు 24 గంటలు టోల్ ఫ్రీ సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చిన వీలుగా చెప్పుకునే విధంగా తన మనుషులతో పాటు తాను కూడా అందుబాటులో ఉంటాను అన్నారు. విద్య, వైద్యం, ఆర్థికంగా తన సొంత ఖర్చుతో సేవలు మరియు, ప్రతి ఊరిలో 10 ఇండ్లను సొంత ఖర్చులతో నిర్మిస్తాము. ఆడ కూతురు పెళ్లి కానుకగా 25వేల రూపాయలు సహాయం, కులమత బేధాలు లేకుండా అన్ని మతాల పండుగలకు,అన్నదానాలకు సొంతంగా సాయం చేస్తాను, చదువుకునే పిల్లలకు క్రీడల కిట్,విద్య, ఉపాధి పరంగా సహాయ సహకారాలు అందిస్తాము అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు సామాన్య ప్రజలను పట్టించుకోవడంలేదని, వాళ్ల పాలను దృష్టి మొత్తం సంపాదన మీద పడిందని, ప్రజల సమస్యలు వారికి పట్టవని అన్నారు.. నియోజకవర్గంలో ఎంతోమంది ప్రజల ఇళ్లను కూల్చి వారు ఇంద్ర భవనములు నిర్మించుకొని సకల సౌకర్యాలను పొందుతున్నారు. ప్రజలు కిరాయి ఇళ్లలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇలాంటి అవినీతి నాయకులు మనకు వద్దు అని మన బాధలు తెలిసిన వాడిగా మన కుటుంబాల్లో ఒకడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తనను ప్రతి ఒక్కరు ఆదరించాలని అన్నారు.. ప్రజలందరు సింహం గుర్తుకు ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్వచ్ఛమైన ప్రజాస్వామ్యపాలన అంటే ఏంటో నిరూపిస్తానని పిలుట్ల రఘు అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు,ఓజో ఫౌండేషన్ సభ్యులు, రఘున్న అభిమానులు, ఎఐఎఫ్ బి సింహం గుర్తు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: