Thursday, 30 July 2026 04:22:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గృహ వినియోగదారుల కోసం ప్రమాద రహిత కాంపోజిట్ సిలిండర్లను ప్రవేశపెట్టిన... - ఇండేన్ గ్యాస్ సేల్స్ ఆఫీసర్ అంకుర్

Date : 09 October 2023 10:02 AM Views : 265

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ వాసుదేవ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో నూతన 10 కేజీ కాంపోజిట్ సిలిండలను వినియోగ దారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా,ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ అంకుర్ మాట్లాడుతూ ఇండేన్ గ్యాస్ నూతనంగా గృహ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన 10 కేజీ కాంపోజిట్ సిలిండర్లు ప్రమాద రహిత మని వారు అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తు న్నటువంటి స్టీల్ బాడీ సిలిండర్ల తో పోల్చుకుంటే ఈ నూతన కాంపోజిట్ సిలిండర్లు 50 శాతం తేలికైనవి, సిలిండర్ లో గ్యాస్ ఎంత శాతం ఉందో సిలిండర్ ని చూస్తూనే అంచనా వేయవచ్చు అని,ఈ నూతన కాంపోజిట్ సిలిండర్ మనోహరమైన రూపంతో రూపొందించ బడిందని,ఈ నూతన కాంపోజిట్ సిలిండర్ మెటీరియల్ తో చేయబడింది కనుక తుప్పు పట్టే అవకాశం లేదు దీని కారణంగా వంట గదిలో ఎలాంటి మరకలు పడే అవకాశం ఉండదని, అగ్ని ప్రమాదాలను సైతం తట్టుకో గలిగే సామర్ధ్యం కలిగిన మెటీరియల్ తో తయారు చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ అని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో ఈ కాంపోజిట్ సిలిండర్ తయారు చేయబడిందని వినియోగదారులందరూ ఈ కాంపోజిట్ సిలిండర్లను ఉపయోగించు కోవాలని వారు అన్నారు. అనంతరం శ్రీ వాసుదేవ ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కవిత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ గ్యాస్ వినియోగదారులు ఈ కాంపోజిట్ సిలిండర్లను వినియోగించు కోవాలని సిలిండర్ కావాల్సిన వారు టీచర్స్ కాలనీ నందుగల తమ ఆఫీస్ నందు గానీ తమ గ్రామానికి వచ్చే మా ఏజెన్సీ డెలివరీ బాయ్స్ ని గాని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు వినియోగ దారులకు విజ్ఞప్తి చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :