Monday, 14 September 2026 09:25:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏజెన్సీ గ్రామాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపర్చాలి... -ఆదివాసి సంక్షేమ పరిషత్

Date : 22 November 2024 09:16 AM Views : 642

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు అధ్యక్షనలోముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో భారత రాజ్యాంగం లో పేర్కొన్నటువంటి విద్య హక్కును అందరికీ న్యాయమైన విద్యను అందించాలన్నారు.దేశం అభివృద్ధి జరగాలంటే దానికి పునాది పాఠశాల విద్య ,కాలేజీ విద్య,విశ్వ విద్యాలయ విద్య అనేది చారిత్రిక సత్యం. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకు ఇచ్చే ప్రాజెక్టుల పనుల మీద ఉన్నంత శ్రధ్ధ పిల్లలకు నాణ్యత కలిగిన చదువు చెప్పించడం మీద దృష్టి పెట్టలేకపోతున్నారని మండుపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య లేకపోవడం వల్లనే ప్రైవేటు కాన్వెంట్ స్కూళ్లలో పిల్లలను చదివించుకుంటున్నారని అన్నారు. పేద నిరుపేదలైన ఆదివాసుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఊర్లోని ప్రభుత్వ బడి చదువుకు పిల్లలను పంపించడం జరుగుతుందని అన్నారు.ఆలుబాక గ్రామపంచాయతీ ముత్తారం, కలిపాక గ్రామంలో మూడు నెలల నుండి టీచర్స్ లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు ఆటపాటలతో ఫలక బలపం పట్టాల్సిన వయసులో అడవుల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కొంతమంది తరగతి గదుల్లో సమయపాలన పాటించట్లేదని, సమయానికి బడికి రావట్లేదని మండిపడ్డారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎలా వస్తుందని వాపోయారు. కొన్ని ప్రభుత్వ బడి లో పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ఇవ్వట్లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటిడిఎ అధికారులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా మెరుగైన ప్రభుత్వ బడుల విద్యా వ్యవస్థ కోసం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపి, కుర్సం ముత్తయ్య ,మీడియం పెద్ద ముత్తయ్య, కుంజా సంతోష్ మడకం ప్రసాద్,మీడియం అర్జున్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :