Wednesday, 29 July 2026 05:38:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి భాద్యత... - ఎస్పీ డా.వినీత్.జి

Date : 26 October 2023 04:34 AM Views : 324

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ(ఫ్లాగ్ డే) కార్యక్రమాలలో భాగంగా అక్టోబర్ 21 నుండి 30వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే బుధవారం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ డా. వినీత్.జి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ నుండి ప్రారంభమయ్యి ఇల్లందు క్రాస్ రోడ్ నుండి రైల్వే స్టేషన్, బస్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి విద్యానగర్ కాలనీ బైపాస్ వద్ద నుండి టర్న్ తీసుకుని మరలా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి సింగరేణి హెడ్ ఆఫీస్, గోధుమ వాగు బ్రిడ్జి మీదుగా రామవరం, 2టౌన్ పోలీస్ స్టేషన్ నుండి రుద్రంపూర్ పార్క్ వరకు సాగింది.ఈ సైకిల్ ర్యాలీలో సుమారుగా 150 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పోలీస్ అమరవీరుల స్మారక మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంతమంది పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్చావాయువులను పీల్చగలుగుతున్నామని అన్నారు. వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. ఉత్సాహంగా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహర్, ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ , ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, సి. ఆర్. పి. ఎఫ్ అధికారులు రితేష్ తాకూర్, సెంతిల్ కుమార్, కమల్ వీర్ యాదవ్, రజిత, సందీప్ రెడ్డి, 6th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ అంజయ్య,డీఎస్పీలు రెహమాన్, వెంకటేష్, రాఘవేందర్రావు, రమణ మూర్తి, మల్లయ్య స్వామీ, సీతారామ్, సిఐలు, ఎస్సైలు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :