Thursday, 30 July 2026 03:35:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కౌలు రైతులకూ ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం... - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్

Date : 13 November 2023 07:37 AM Views : 203

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌లో ఉన్న అంశాలను వ్యవసాయానికి అమలు చేసి వ్యవసాయాన్ని పండగ చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని వ్యవసాయ కూరగాయల మార్కెట్ యార్డులో పలు రైతులను వ్యాపారులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా కలుసుకున్నారు. రైతుల వద్ద కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా రైతుల సాధక బాధకాలు శ్రద్ధగా విన్నారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుందో రైతాంగానికి అదేవిధంగా వ్యాపారులకు అక్కడికి వచ్చిన స్థానిక ప్రజలకు వివరించారు. ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు. మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేందుకు చర్యలు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు. మెరుగైన పంటల బీమా పథకం అమలు. శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహా రం అందించేలా ఏర్పాట్లు. రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం. పోడు భూములు, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన. రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్‌ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్‌ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు. అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి. రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు. భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు. పంటలకు గిట్టుబాటు ధరల కల్పన లాంటి నూతన ప్రణాళికలు చేపట్టి వ్యవసాయాన్ని రైతులను ప్రజలను కాపాడుతామని శంకర్ అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :