Tuesday, 15 September 2026 11:35:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సెప్టెంబర్ 1 తేదీ నుండి 9 తేదీ వరకు జరుగుతున్న " జాతీయ లోక్ అదాలత్ "ను సద్వినియోగం చేసుకోండి...

Date : 03 September 2023 12:46 AM Views : 381

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి...ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి  జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 01-09-2023 నుండి 09-09-2023 వ తారీఖు వరకు కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం కోర్టులలో "నేషనల్ లోక్ అదాలత్" సందర్భంగా కక్షీదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సంబంధించిన ప్రజలకు మందలపల్లి గ్రామంలో ఈ నెల 06.09.2023వ తేదీన న్యాయాధికారులు అందుబాటులో ఉంటారని తెలియజేసారు. మీకు తెలిసిన వాళ్లపై ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు,చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్న చిన్న దొంగతనం కేసులు, కరోనా సమయంలోని కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని అన్నారు. కేసును బట్టి 50 రూపాయల నుండి 1000 రూపాయల వరకు జరిమానా చెల్లించి తమపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలియజేసారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు.ఈ రెండు రోజులపాటు జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ కేసులు 130, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 340,ఈ-పెట్టీ కేసులు 380 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: