సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : గత మూడేళ్లుగా రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించకపోతే సంక్రాంతి పండుగ అనంతరం ఏ క్షణాన అయినా నిరవధిక సమ్మె చేస్తామని CITU జిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్, వై విక్రమ్ హెచ్చరించారు.గత మూడేళ్లుగా తమకు రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీవేజ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( citu) ఆధ్వర్యంలో సోమవారం NST రోడ్ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు . ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక నెల జీతం రాకపోతేనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులూ పడే పరిస్థితిలో గత మూడేళ్లుగా జీతాలు ఇవ్వకపోతే వారు ఎంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు అని అధికారులు ఈ విషయాన్ని గమనించాలని వారు డిమాండ్ చేశారు. జీతాలకు సంభందించిన చెక్ ఫైనాన్స్ అనుమతి కోసం వుంది అని గత కొంతకాలంగా అధికారులు చెబుతూ కార్మికులను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయకపోతే సంక్రాంతి పండుగ అనంతరం సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం CITU నేతలతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, కాంపాటి వెంకన్న, బాదావత్ లక్మా, మల్లికార్జున్, జె వెంకన్న బాబు, ప్రవీణ్, పి వాసు, సంతోష్, లక్ష్మి దేవి, వీరమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin