Thursday, 30 July 2026 12:26:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని...

Date : 27 November 2022 01:46 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ఉరవకొండ, వైస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య లు అన్నారు.ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో శనివారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు. వైస్ ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ వీరంజినేయులు, గ్రామస్తులు,అగ్రి అడ్వైజరి బోర్డు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.పులా వర్షం కురిపించారు.ముందుగా సిద్దేశ్వర స్వామి వారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను విశ్వేశ్వరరెడ్డి వివరించారు.ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.ఈ సందర్భంగా పైలా నరసింహయ్య, విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.మహిళలని మహారాణులుగా మార్చే లక్ష్యంతో సిఎం జగన్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. నాడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయడంతోపాటు మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అయితే జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల వడ్డీమాఫీతో పాటు రుణమాఫీ చేసిన ఘనత దక్కుతుందన్నారు.అంతేగాకుండా ఎక్కువ శాతం మహిళల పేరు మీదే సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయల, వాలంటరీ వ్యవస్థల ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గర అయిందన్నారు.మరోవైపు ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఏపీ పథకాలు వారి రాష్ట్రంలో కూడా ప్రవేశ పెడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానానికి చేరుకోవాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు నాయకులు,కార్యకర్తలు బాధ్యతగా మెలిగి కష్టించి పని చేసి మరోసారి అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, విడపనకల్లు ఎంపీపీ కరణం పుష్పావతి, ఉరవకొండ సర్పంచ్ లలిత, ఉరవకొండ, అమిద్యాల,విడపనకల్లు పిఏసీఎస్ చైర్మన్లు వడ్ల షేక్షావలి,తేజోనాథ్,శ్రీరాములు,వజ్రకరూర్ మండల కన్వీనర్ హనుమంత రెడ్డి, నాయకులు కరణం భీమరెడ్డి, ఆశోక్ కుమార్,సిపి వీరన్న, గోపాలకృష్ణ, బూదగవి ధనుంజయ,శ్రీనివాసులు, భీమేష్, వెలిగొండ నాయకులు నాగప్ప, రామకృష్ణ, సిద్ధప్ప, శివ, చెన్నకేశవులు, సుధాకర్, శంకర్ గౌడ్, పాలక్షి దేవేంద్ర, వీర, సురేష్, రామకృష్ణ, నాగరాజు, మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు,సచివాలయ సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :