Friday, 08 May 2026 09:22:10 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అప్రమత్తంగా ఉండండి... - కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి

Date : 29 July 2025 02:13 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి జిల్లా : కంగ్టి మండల ప్రజలు తమ బ్యాంకు ఖాతా నుంచి తెలియకుండా డబ్బులు ఖజేసిన వెంటనే 1930,టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి, మండల ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ కు ఈ నెల 27 ఉదయం మూడు మెసేజ్ లు వచ్చాయి.10.09 నుంచి 10.11 గంటల వ్యవధిలో అంటే. మూడు నిమిషాల వ్యవధిలో రూ.50 లక్షలు రెండుసార్లు. రూ.10 లక్షలు ఒకసారి. అంటే మొత్తంగా రూ.1.10 కోట్ల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంక్ నుంచి మేసేజ్ వచ్చింది.వెంటనే హర్ష గుండె ఆగినంత పనైంది.తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు.ఆ వెంటనే అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అంటే 10.22 గంటల వేళలో 1930 నెంబరుకు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు.వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్,అండ్ మేనేజ్ మెంట్ సిస్టం సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్టు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దీగి బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్,హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు.దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి.నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు.ఇదే విషయాన్ని బాధితుడికి రూ.10.42 గంటల వేళలో ఫోన్ కు మెసేజ్ వచ్చింది.సైబర్ నేరస్తులు దోచేసిన రూ.1.10 కోట్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు అని అన్నారు.దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి 1930 కు ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి మండల ప్రజలకు సూచించారు.ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికి చెప్పండి.అందరిలోనూ 1930 నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం అందరిపైన ఉందఅని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :