సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సివిల్ వివాదంలో అనధికారికంగా జోక్యం చేసుకున్నారని ఆరోపణలపై వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్సై మహేందర్ ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన భూ వివాదంతో పాటు, గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో ఎస్సై మహేందర్ ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు లపై ఉన్నతాధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆరోపణలకు బలం చేకూరడంతో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
-----------------------
Reporter