Wednesday, 29 July 2026 04:56:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముస్తాబైన ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్...

Date : 10 January 2023 11:38 PM Views : 811

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం ‘సమీకృత కలెక్టరేట్‌’ ప్రారంభానికి ముస్తాబైంది. ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభంకానుంది. వైరా ప్రధాన రహదారి వీ. వెంకటాయపాలెం వద్ద 20. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 53. 20 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2017లోనే పనులు ప్రారంభమైనప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రత్యేక చొరవతో వాటన్నింటినీ అధిగమించి పనుల్లో వేగం పెంచారు. భవన సముదాయాన్ని జీ ప్లస్‌-2 విధానంలో నిర్మించారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 20 వరకు కార్యాలయాల చొప్పున మొత్తం 56 ప్రభుత్వ శాఖలకు గదులను ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నూతన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నది. అన్ని జిల్లాల్లోనూ ఒకే డిజైన్‌, ప్రభుత్వశాఖల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సముదాయాలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మంలో వైరాప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద నయా కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టింది. పనులు ప్రారంభమైనప్పటి నుంచి సమీకృత భవన సముదాయం వేగవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పలుమార్లు నూతన కలెక్టరేట్‌ భవనం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. సత్వరం పనులు పూర్తికావడం కోసం ప్రతి వారం మంత్రి పువ్వాడ పర్యవేక్షించారు. మూడు అంతస్తులు. నాలుగు బ్లాకులు ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ఆకర్షణీయంగా, అద్భుతంగా తయారైంది. దీన్ని జీప్లస్‌-2 విధానంలో నిర్మించారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు బ్లాకులుగా విభజన చేశారు. ఒక్కో బ్లాకులో 20 వరకు కార్యాలయాల చొప్పున మొత్తం 56 ప్రభుత్వ శాఖలకు గదులను నిర్మించారు. సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం కోసం 2017 మే 1న ప్రభుత్వం రూ. 35. 38 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. అయితే, కలెక్టర్‌ భవన నిర్మాణ వ్యయం పెరగడంతో 2020 సెప్టెంబర్‌లో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణ వ్యయాన్ని రూ. 53. 20కోట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్‌ మొత్తం విస్తీర్ణం 1, 59, 307చదరపు గజాలు ఉంది. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌ 53. 900 చదరపు గజాలు మొదటి అంతస్తు 50. 874చదరపు గజాలు, రెండో అంతస్తు 54. 493 చదరపు గజాల్లో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కలెక్టర్‌ చాంబర్‌, అదనపు కలెక్టర్‌ చాంబర్‌లతోపాటు డీఆర్‌వో కార్యాలయాలు నిర్మించారు. 250 మందితో సమావేశం నిర్వహించేలా సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌, కలెక్టరేట్‌ సిబ్బంది గదులు నిర్మించారు. మొదటి అంతస్తులో మంత్రులు, ఉన్నతాధికారులు, స్టేట్‌ చాంబర్‌, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, వివిధశాఖలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు పలు శాఖల కార్యాలయాలను నిర్మించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :