సర్కార్ టీవీ న్యూస్ / యాదాద్రి జిల్లా : యాదాద్రి జిల్లాలో బాలల పరిరక్షణ అధికారి పి సైదులు, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ జయశ్రీ, గౌర్నమెంట్ తాత్కాలిక ఉద్యోగ హోదాలో ఉంటూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలను బేఖాతర్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి మేము మీకు అనుకూలంగా ఉంటాము మా తరఫున మా వారి సహకారం కూడా మీకే ఉంటుంది మా ఫైల్ ని కాస్త ముందుకు ముందుకు కదిలించి మా పని జరిగేలా చూడగలరని రహస్య ఒప్పందం చేసుకున్నారు . ఇట్టి విషయం 14- 10 -23న జరగగా అప్పటినుండి ఇప్పటివరకు కూడా ఈసీ కానీ, కలెక్టర్ గాని ,మహిళా , శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా చర్య తీసుకోకపోవడంపై అసలు రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఉందా ఎన్నికల టైం లో ఎలక్షన్ కమిషన్ పాలన ఉందా అని ప్రజలు విస్మయంలో ఉన్నారు కలెక్టర్ , సంబంధిత అధికారికి ఇట్టి పిర్యాదు పై సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
-----------------------
Admin