సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్:యర్రారం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శణం అనంతరం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ …స్వామివారు స్వయంభువుగా వెలిసిన స్థలాన్ని ,స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుక్రుతమని ,దర్శించుకున్న భక్తులందరూ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారని,అంతేకాకుండా యాదగిరిగట్ట,మట్టపల్లి వంటి క్షేత్రాల్లో స్వయంభువుగా వెలినట్టు పెద్దలు చరిత్ర చెబితే వినడమే కానీ చూడలేదు.అట్టి మహా భాగ్యాన్ని మనం యర్రారం లో చూస్తున్నాము.యర్రారానికి వచ్చిన భక్తుల కోర్కెలు నెరవేరడంతో భక్తులు మల్లీ మల్లీ వస్తున్నారు. యర్రారం పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని,వాటిని భక్తులు తిప్పికొడతారని, అన్నారు కలియుగంలో ధర్మానికి ఆటంకం కలుగుతున్నపుడు భగవంతుడు ఇలా అవతరిస్తూ ఉంటాడు స్వామివారు ఇక్కడే వెలవడానికి గల కారణం ఏమటీ …ఇక్కడ ఏ ఏ దేవతా చైతన్యం ఉన్నది అనే అనేక ప్రశ్నలకు మనకు సమాదానం లబించాలంటే .. ప్రాచీన భారతీయ జ్యోతిష శాస్త్రం లోని అష్టమంగళప్రశ్నలో భాగమైన దేవ ప్రశ్న చేయవలసి ఉన్నది .ప్రస్తుతం ఈ ప్రశ్న చేయగలిగేవారు కేరళ రాష్ట్రం మాత్రమే ఉన్నారు వారిని పిలిపించి దేవ ప్రశ్న చేసి భక్తులంతా కలిసి దేవాలయ అభివృద్ధి కి పాటుపడాలని జ్ఞనరత్న ,వాస్తురత్న అవార్డ్ గ్రహీత మామిడి సత్యనారాయణ అన్నారు
-----------------------
Admin